షామ్లీ జిల్లా


Contributors to Wikimedia projects

Article Images

షామ్లీ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో షామ్లీ జిల్లా (హిందీ:शामली जिला) ఒకటి. 2011 సెప్టెంబరు 28న ముజఫర్ నగర్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడ్జింది. ముందుగా ఈ జిల్లా ప్రబుధ్ జిల్లాగా పిలువబడింది. తరువాత 2012 జూలైలో దీనికి షామ్లీ అని పేరుమార్చబడింది. ఇది ఢిల్లి నుండి దాదాపు 100 కి.మీ దూరంలో ఉంది. జిల్లా సారవంతమైన గంగా- యమునా మైదానంలో ఉంది. జిల్లా వ్యవసాయంగా సుసంపన్నమై ఉంది. జిల్లా షుగర్ మిల్లులకు ప్రసిద్ధిచెందింది.

షామ్లీ జిల్లా

शामली जिला

జిల్లా

Location of Shamli district in Uttar Pradesh

Location of Shamli district in Uttar Pradesh

Coordinates: 29.4502° N, 77.3172° E
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
విస్తీర్ణం
 • Total1,032 కి.మీ2 (398 చ. మై)
Elevation248 మీ (814 అ.)
జనాభా

 (2011)

 • Total13,17,815
 • జనసాంద్రత1,300/కి.మీ2 (3,300/చ. మై.)
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN

247776

టెలిఫోన్ కోడ్01398
Vehicle registrationUP 19
లింగ నిష్పత్తి1000:928 /
Websitehttp://shamli.nic.in
కైరానాలోని నవాబ్ తలాబ్

1857లో ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటుకు ఈ జిల్లా ప్రాంతం కేంద్రంగా ఉంది. అయినప్పటికీ తరువాత ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ ఇండియా తిరిగి స్వాధీనం చేసుకుంది. నగరం మొదటి పానిపట్టు యుద్ధం (1526), రెండవ పానిపట్టు యుద్ధం (1556), మూడవ పానిపట్టు యుద్ధం (1761), సిక్కుల తిరుగుబాటుకు ఇది సాక్ష్యంగా ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత హరితవిప్లవానికి జిల్లా కేంద్రంగా ఉండి దేశం ఆత్మవిశ్వాసంతో అభివృద్ధి పధంలో సాగడానికి చేయూత ఇచ్చింది.

ముజఫర్ నగర్ జిల్లా నుండి కొంతభూభాగం వేరు చేసి 2011 సెప్టెంబరు న ఈ జిల్లా ప్రబుధ్ జిల్లాగా రూపొందించబడింది. ముజాఫర్‌నగర్ షామ్లి, కైరానా తాలూకాలను వేరుచేసి కొత్త జిల్లా రూపొందించబడింది. 2012 జూలైలో జిల్లాకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం షామ్లీ అని పేరు మార్చింది.[1]

షామ్లీ జిల్లా 29.45° ఉత్తర అక్షాంశం 77.32° తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా సముద్రమట్టానికి 248 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఢిల్లీ నుండి 99 కి.మీ దూరం, పానిపట్టుకు 38 కి.మీ దూరంలో, మీరట్ నుండి 70 కి.మీ దూరంలో, కర్నల్ నుండి 40 కి.మీ దూరం, షహరంపూర్ నుండి 65 కి.మీ దూరంలో ఉంది. ఇది యమునా నది తూర్పు తీరంలో ఉంది. యమునా నది హర్యానా, ఉత్తర ప్రదేశ్ మధ్య సరిహద్దు ఏర్పరుస్తూ ఉంది. జిల్లా గంగా యమునా మైదానంలో ఉంది.

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్యలో పురుషులు 54%
స్త్రీలు 46%
ప్రజలు అధికశాతం హిందువులు, ముస్లిములు
ఇతరులు సిక్కులు, క్రైస్తవులు, జైనులు
అక్షరాస్యత 59.5%
పురుషుల అక్షరాస్యత 70%
స్త్రీల అక్షరాశ్యాత 57%
6 సంవత్సరాల లోపుంపిల్లాలు 15%

జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. జిల్లా ఆర్థికంగా శక్తివంతంగా ఉంది. గంగా యమునా మైదానాల మధ్య ఉన్నందున జిల్లాలో షుగర్ మిల్లులు అధికంగా ఉన్నాయి. ఢిల్లీకి సామీప్యతలో ఉన్నందున ఇది పరిశ్రమలకు అనుకూలంగా ఉంది. జిల్లాలో స్టీలు, పేపర్ మిల్లులు అధికంగా ఉన్నాయి. జిల్లా వీల్ రింస్ తయారీలో అంతర్జాతీయ గుర్తింపును కలిగి ఉంది.

జిల్లాలో పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలలో ఒకటైన హనుమాన్ తిల్లా ఉంది. దీనిని భీముడు నిర్మించాడని విశ్వసిస్తున్నారు. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధం నివారించడానికి ముందు చివరిసారిగా ఇక్కడ విశ్రమించాడని భావిస్తున్నారు. అందుకే నగరానికి తరువాత ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. లక్ష్మణుని బ్రతికించడానికి హనుమంతుడు సంజీవని పర్వతం తీసుకుని వెళ్ళే సమయంలో ఇక్కడ విశ్రమించాడని మరి కొందరు భావిస్తున్నారు.

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-10-24. Retrieved 2015-03-18.