సుబర్నపూర్


Contributors to Wikimedia projects

Article Images

సుబర్నపూర్

ఒడిశా రాష్ట్రం సుబర్నపూర్ జిల్లా ముఖ్యపట్టణం

సుబర్నపూర్, ఒడిషాలోని సుబర్నపూర్ జిల్లాకు చెందిన పట్టణం, ఈ జిల్లాకు ప్రధాన కార్యాలయం. దీన్ని సోనేపూర్ అని కూడా పిలుస్తారు. వాస్తుకళాపరమైన ప్రాముఖ్యత, తాంత్రికత కలిగిన దేవాలయాల సమూహానికి ఈ పట్టణం ప్రశస్తి. దీన్ని రెండవ వారణాసి అని స్థానికులు పిలుస్తారు. అలహాబాద్‌లో మాదిరిగానే ఇక్కడ కూడా మహానది, టెల్ అనే రెండు నదుల సంగమం జరుగుతున్నందున దీన్ని రెండవ అలహాబాద్ అని కూడా పిలుస్తారు.[1] సుబర్ణపూర్ పట్టు, చేనేత, రొయ్యలు, టెర్రకొట్టా మొదలైనవాటికి కూడా ప్రసిద్ధి చెందింది.

సుబర్నపూర్

సోనేపూర్

పట్టణం

సుబర్నపూర్ is located in Odisha

సుబర్నపూర్

సుబర్నపూర్

ఒడిశా పటంలో పట్టణ స్థానం

Coordinates: 20°50′N 83°55′E / 20.83°N 83.92°E
దేశం India
రాష్ట్రం ఒడిశా
జిల్లాసుబర్నపూర్
Elevation121 మీ (397 అ.)
జనాభా

 (2001)

 • Total17,535
భాషలు
 • అధికారికఒరియా
 • మాట్లాడేవిసంబల్‌పురీ భాష
Time zoneUTC+5:30 (IST)
PIN

767017

Telephone code06654
Vehicle registrationOD-31
Website

సోనేపూర్ బ్రిటిషు భారతదేశం లోని సోనేపూర్ సంస్థానానికి రాజధానిగా ఉండేది.[2]

2001 జన గణన ప్రకారం,[3] సోనేపూర్ జనాభా 17,535. ఇందులో పురుషులు 53% కాగా స్త్రీలు 47%. సోనేపూర్ సగటు అక్షరాస్యత 74%. జాతీయ సగటు 59.5% కంటే ఇది బాగా ఎక్కువ. పురుషుల్లో అక్షరాస్యత 82% కాగా, స్త్రీలలో ఇది 65%. సోనేపూర్‌ జనాభాలో 11% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు.

  • శ్రీ కపిలేశ్వర్ తాంపుల్ చార్దా
  • భగవతీ దేవాలయం
  • బుధిమ దేవాలయం
  • బుద్ధి సోమలై ఆలయం
  • దాధిబాబన్ ఆలయం
  • దశమతి దేవాలయం
  • గోకర్ణేశ్వర దేవాలయం
  • గుండిచా / నృసింహనాథ్ ఆలయం
  • జగన్నాథ దేవాలయం
  • ఖంబేశ్వరి ఆలయం
  • కోసలేశ్వర దేవాలయం
  • లంకేశ్వరి ఆలయం
  • నారాయణి దేవాలయం
  • పశ్చిమ సోమనాథ దేవాలయం
  • రామచండి దేవాలయం
  • రామేశ్వర దేవాలయం
  • సోమలేశ్వరి ఆలయం
  • సురేశ్వరి ఆలయం
  • సుబర్ణమేరు దేవాలయం
  • బాలాజీ (హనుమాన్) దేవాలయం
  • శ్రీరాం (రామసీత) దేవాలయం
  • పంచరథ దేవాలయం