సేనాపతి


Contributors to Wikimedia projects

Article Images

సేనాపతి

మణిపూర్ రాష్ట్రంలోని సేనాపతి జిల్లా ముఖ్య పట్టణం.

సేనాపతి, మణిపూర్ రాష్ట్రంలోని సేనాపతి జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధానకేంద్రం.[1]

సేనాపతి

పట్టణం

సేనాపతి is located in Manipur

సేనాపతి

సేనాపతి

భారతదేశంలోని మణిపూర్ లో ప్రాంతం ఉనికి

సేనాపతి is located in India

సేనాపతి

సేనాపతి

సేనాపతి (India)

Coordinates: 25°16′22″N 94°01′35″E / 25.2727°N 94.0265°E
దేశం భారతదేశం
రాష్ట్రంమణిపూర్
జిల్లాసేనాపతి
జనాభా

 (2011)

 • Total2,183
 • జనసాంద్రత87/కి.మీ2 (230/చ. మై.)
భాషలు
 • అధికారికమీటీ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్

795106

టెలిఫోన్ కోడ3871
Vehicle registrationఎంఎన్
Literacy82.41%

ఈ పట్టణం 25°16′22″N 94°01′35″E / 25.2727°N 94.0265°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ పట్టణంలో మొత్తం 393 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ 2,183 జనాభా ఉంది. అందులో 1,126 మంది పురుషులు ఉండగా, 1,057 మంది స్త్రీలు ఉన్నారు. మొత్తం జనాభాలో 307 (14.06%) మంది 0-6 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. సేనాపతి పట్టణ సగటు స్త్రీ పురుష నిష్పత్తి 939 కాగా, ఇది మణిపూర్ రాష్ట్ర సగటు 985 కన్నా తక్కువగా ఉంది. ఇక్కడి అక్షరాస్యత 82.41% కాగా, రాష్ట్ర సగలు 76.94% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 88.87% కాగా, మహిళా అక్షరాస్యత 75.50% గా ఉంది.[2]

ఇక్కడ పౌమై, మావో, మరం, తంగల్, జెలియాంగ్‌రాంగ్ నాగ తెగలు మొదలైనవారు ప్రధానంగా ఉన్నారు. ఇతరులలో తంగ్ఖుల్, మారింగ్ నాగస్, కుకిలు, నేపాలీ, మైనారిటీలు ఉన్నారు.

ఇక్కడ 98% మంది క్రైస్తవులు, 2% మంది హిందువులు ఉన్నారు.

వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉంది. ఇక్కడ వరి, మొక్కజొన్న, బంగాళాదుంప, క్యాబేజీ, తృణధాన్యాలు మొదలైన పంటలు పండిస్తారు. పశువులు, గేదె, పంది, మేకలు పెంచుకుంటుంటారు.

ఈ ప్రాందంలో 80% భూమి దట్టమైన అడవులతో నిండి ఉంది.[3]

  1. మావో
  2. యాంగ్ఖుల్లెన్
  3. డుకో లోయ
  4. లియాయి
  5. పురుషల్
  6. మరం ఖుల్లెన్
  7. మాఖెల్ గుహ
  8. సడు చిరు జలపాతాలు
  1. "Senapati Village in Mao Maram (Senapati) Manipur | villageinfo.in". villageinfo.in. Retrieved 2021-01-08.
  2. "Senapati Village Population - Mao-Maram - Senapati, Manipur". www.census2011.co.in. Retrieved 2021-01-08.
  3. "Top 8 Places To Visit In Manipur". Trans India Travels. 2016-12-05. Retrieved 2021-01-08.