హింగ్ల


Contributors to Wikimedia projects

Article Images

హింగ్ల

హింగ్ళా లంబాడీ గిరిజన ప్రజల దేవత. లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను పూజిస్తారు. వారిలో త్వళ్జ ఒకరు.[1]

హింగుళాదేవి, గిరిజనుల కులదేవత

లంబాడీ సంస్కృతిలో హింగ్ళా దేవత

మార్చు

తండాలో ఏ కార్యం జరిగినా పెళ్ళి, పుట్టుకలు, చావులు, పండుగలు అయినా సామూహికంగా తండా పెద్దలే జరిపించేవారు. పెళ్ళి అయితే ఆ తండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోయేవారు. ఇంటిల్లిపాదీ భోజనంచేసేవారు. ప్రతి మనిషి తంతులో పాల్గొనాల్సిందే. పాటలతో లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను కొలుస్తారు. వారు మేరమ్మ, త్వళ్జ, సీత్ల, మంత్రల్, హింగ్ళా, ధ్వాళ్ ఆంగళ్, కంకాళీ. పుట్టే ప్రతి పిల్లతో పాటు తల్లి తాండా ఆరోగ్యంగా ఉండాలని పుట్టిన ప్రతి వారు అన్ని విధాల దృఢంగా ఉండాలని తిండి, అలవాట్లు మెరుగుపర్చుకొని బిడ్డను కాపాడాలని హింగ్ళా దేవతను మొక్కుకుంటారు.[2]