కన్నతల్లి (1953 సినిమా)


Contributors to Wikimedia projects

Article Images

ఇదే పేరుగల మరొక సినిమా కోసం కన్నతల్లి (1972 సినిమా) చూడండి

కన్నతల్లి (1953)
(1953 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ప్రకాశరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
జి.వరలక్ష్మి,
నంబియార్,
ఆర్. నాగేశ్వరరావు,
రాజ సులోచన
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ ప్రకాష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

శాంతి (జి.వరలక్ష్మి), చలపతి (ఆర్.నాగేశ్వరరావు)ని పెళ్ళాడుతుంది. వారికి రాము (నాగేశ్వరరావు), శంకర్ (నంబియార్) ఇద్దరు పిల్లలు. కుటుంబాన్ని పోషించలేని చలపతి భార్యాబిడ్డల్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతాడు. శాంత కుటుంబభారాన్ని మోస్తూ విస్తర్లు కుట్టి రాము ద్వారా అమ్మిస్తుంది. ఆ సొమ్ముతో పట్టణంలో శంకర్ ను వుంచి చదివిస్తుంది. రాము కట్నం తీసుకొని పెళ్ళి చేసుకొని ఆ డబ్బు కూడా తమ్ముడికి పంపిస్తాడు. శంకర్ చెడు అలవాట్లకు బానిస అవుతాడు. శంకర్ ను పల్లెటూరులో వుండే గౌరి ప్రేమిస్తుంది.

శాంత కొడుకును మంచి దారిలో పెట్టాలని టౌనుకు వెళ్ళేసరికి శంకర్ తన ఉంపుడుగత్తెను చంపి పారిపోతాడు. ఇది చూసిన శాంత తన కొడుకును రక్షించటానికి ఆ హత్యానేరం తనపై వేసుకొంటుంది. జైలులో ఆమె తన భర్త చలపతిని కలుసుకొని జరిగిన కథ చెబుతుంది. అక్కడకు వచ్చిన రము త్యాగబుద్ధితో హత్యానేరం తనపై వేసుకొంటానంటాడు. కానీ తల్లి వారించి శంకర్ కు గౌరికి పెళ్ళి జరిపించమని కోరుతుంది. అపరాధిగా చట్టానికి చిక్కిన కన్నతల్లి శాంతను సుదూర తీరాలకు తరలిస్తారు పోలీసులు.

  1. ఇదే ఇదే సరాగం ఇదే కదా అనురాగం - కె. రాణి, ఎ.ఎం. రాజా - రచన: ఆరుద్ర,శ్రీశ్రీ
  2. ఎంత మంచిదానవోయమ్మ నీదెంత వింత విధాన - ఘంటసాల - రచన: శ్రీశ్రీ - ఆరుద్ర
  3. ఎందుకు పిలిచావెందుకు ఈలవేసి సైగచేసి - పి. సుశీల,ఎ.ఎం. రాజా - రచన: శ్రీశ్రీ - ఆరుద్ర
  4. కొమ్మనే ముద్దుగుమ్మనే పరివంపు - పసుమర్తి కృష్ణమూర్తి,లలిత బృందం - రచన: శ్రీశ్రీ - ఆరుద్ర
  5. చూచావా ఆ చివరికదే నోచావా చేసిన త్యాగం తగిలిన - ఘంటసాల - రచన: ఆత్రేయ,శ్రీశ్రీ
  6. చూస్తారెందుకు రారండి వస్తువు మంచిది కొనుకోండి - ఎం. సరోజిని - రచన: తాపీ ధర్మారావు
  7. డేగలాగ వస్తా తూరీగ లాగ వస్తా నే ఊగి తూగి వస్తా - కె. రాణి - రచన: శ్రీశ్రీ - ఆరుద్ర
  8. లావొక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యె ( పద్యం ) - పి. సుశీల - భాగవతం నుండి
  9. సాంబసదాశివ సాంబసదాశివ.. సారములేని - మాధవపెద్ది బృందం - రచన: శ్రీశ్రీ - ఆరుద్ర
  10. సిరికిన్ చెప్పాడు.శంకచక్ర యుగమున్ ( పద్యం ) - జి. వరలక్ష్మి - భాగవతం నుండి
  11. స్వతంత్ర భానుడు ఉదయించె మింట ( గాయకులు ? ) - రచన: సుంకర - వాసిరెడ్డి