జొన్న


Contributors to Wikimedia projects

Article Images

(జొన్నలు నుండి దారిమార్పు చెందింది)

అందరూ ఇష్టపడే చిరుధాన్యం జొన్న. శరీర నిర్మాణానికి తోడ్పడే మాంసకృత్తులు, శక్తినిచ్చే పదార్థాలతో పాటు రక్తవృద్ధికి తోడ్పడే ఇనుము, కాల్షియం, బి-విటమిన్లు, ఫోలిక్‌ ఆమ్లం వంటి సూక్ష్మపోషకాలు జొన్నలో పుష్కలంగా లభిస్తాయి. అందుకే రొట్టెలతో పాటు, జొన్నతో చేసిన పేలాల లడ్డు, అప్పడాలు, అంబలి వంటివి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. 30 దేశాలలో 500 మిలియన్ల ప్రజలు జొన్నలను ప్రధాన ఆహార ధాన్యంగా తీసుకొని జీవిస్తున్నారు. సింధునాగరికతకు సమాంతరంగా కృష్ణా గోదావరీ పరీవాహక ప్రాంతాలలో జొన్నల్నీ బాగానే పండించారు. ఇతర ధాన్యాల కన్నా ఇనుము, జింకు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, జొన్నలు కేలరీలను పెరగనీకుండా శక్తినిస్తాయి. గోధుమలలో ఉండే, గ్లూటెన్ అనే మృదువైన ప్రొటీన్ చాలామందికి సరిపడటం లేదు. జొన్నల్లో గ్లూటెన్ ఉండదు. అందువలన ఈ ప్రత్యామ్నాయ ధాన్యం మీదకు ప్రపంచం తన దృష్టి సారించింది. ఒకవైపున జొన్నలకు ప్రపంచ వ్యాప్తంగా ఈ విధంగా గిరాకీ పెరుగుతుంటే, మనవాళ్ళు పండించటం తగ్గించేస్తున్నారు. భారతదేశంలో గడచిన రెండు దశాబ్దాల కాలంలో 12 మెట్రిక్ టన్నుల నుంచి 7 మెట్రిక్ టన్నులకు జొన్న ఉత్పత్తి పడిపోయిందని ఇక్రిశాట్ నివేదిక చెప్తోంది. జొన్నలు ఇప్పుడు బియ్యం కన్నా ఎక్కువ ధర పలుకుతున్నాయి. ధర పెరగటానికి పంట తగ్గిపోవటం, గిరాకి పెరగటం కారణాలు. రంగు, రుచి, వాసనా లేకుండా తటస్థంగా ఉంటుంది కాబట్టి, జొన్నపిండి ఏ ఇతర వంటకంలో నయినా కలుపుకోవటానికి వీలుపడుతుంది.

జొన్న
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:

సోర్ఘమ్


జాతులు

About 30 species, see text

జొన్న రొట్టెలు
 
తెల్ల జొన్నలు
 
జొన్నచేను
  1. ఇవి తేలిగ్గా జీర్ణమవుతాయి
  2. జబ్బుపడినవారు త్వరగా కోలుకోవడానికి జొన్నలతో చేసిన పదార్థాలను పెట్టడం ఎంతో మంచిది.
  3. అన్ని రకాల జొన్నలూ బాలింతలకు మంచి బలవర్థకమైన ఆహారంగా పనిచేస్తాయి.
  4. తగినంత పీచు ఉండడం వల్ల జీర్ణసమస్యలు రాకుండా ఉంటాయి.
  5. విలువలు కూడా జొన్నలోనే ఎక్కువ. వీటివల్ల 349 కిలోకేలరీల శక్తి లభిస్తుంది.
  1. జొన్న విత్తనాలు: వాణిజ్యపరమైన మద్యం (ఆల్కహాల్) సంబంధ పానీయాలు తయారుచేయడానికి ఉపయోగిస్తారు. కోళ్ళకు దాణాగా వాడతారు. జొన్నలతో చేసే రొట్టెలు ఆహారంగా ఉపయోగపడతాయి.
  2. జొన్న ఆకులు, కాండాలు పశుగ్రాసంగా ఉపయోగిస్తారు. కాగితం తయారీలో వాడతారు.జొన్నపంట పండిన పిదప జొన్నలను వేరుచేసి మిగిలిన కాండము (సొప్ప) పశువులకు ఆహారంగా వేస్తారు.
  • జొన్నలను గిర్నికి (పండి మర) తిసుకొని పోయి పిండి చేయాలి.
  • పిండిని వేడి నీళ్ళతో కలిపి ముద్ద చేయాలి.
  • ముద్దతో చపాతీల మాదిరిగా చేతితో చరుస్తూపలుచగా చేసి పెనం పై రొట్టె చేయాలి.